కొనసాగుతోన్న బీజేపీ ప్రజాప్రతినిధుల భేటీ.. మెయిన్ టార్గెట్ అదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-20 07:30:00  IST  )

బీజేపీ (BJP) రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన ఇవాళ కాసేపటి క్రితం ప్రజాప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది.

కొనసాగుతోన్న బీజేపీ ప్రజాప్రతినిధుల భేటీ.. మెయిన్ టార్గెట్ అదే!
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ (BJP) రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన ఇవాళ కాసేపటి క్రితం ప్రజాప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇంచార్జ్‌లు సునీల్ భన్సల్ (Sunil Bansal), అభయ్ పాటిల్‌ (Abhay Patil)తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు వస్తున్న వేళ నేటి ప్రజాప్రతినిధుల సమావేశానికి అత్యంత ప్రధాన్యత నెలకొంది. ఈ భేటీలో భాగంగా ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రధానంగా చర్చించనున్నారు.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను బేరీజు వేస్తూ.. సంస్థాగతంగా పార్టీ గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవల్ వరకు బలంగా నిలిపేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జూలై మాసంలో స్థానిక ఎన్నికలంటూ లీకులిచ్చిన తరుణంలో ఇప్పటి నుంచే బూత్ లెవల్ నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేలా ఈ భేటీలో ప్రణాళికలు రూపొందినున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం (Central Government) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అధినాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేలా అవగాహన, ఆందోళన కార్యక్రమాలను ముమ్మరం చేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ పావులు కదుపుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు, 2 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుని ఫుల్ జోష్‌లో ఉన్న కమలదళం నేటి ప్రజాప్రతినిధులు సమావేశంతో స్థానిక ఎన్నికలకు సమర శంఖం పూరించింది.

Next Story