Pathan Cheru : పఠాన్ చెరులో రోడ్డెక్కిన పాత కొత్త కాంగ్రెస్ పంచాయితీ!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-23 06:38:59  IST  )

పఠాన్ చెరు(Pathan Cheru) నియోజకవర్గం(Constituency)లో కాంగ్రెస్(Congress) పార్టీ అంతర్గత కలహాలు(Internal Strife) రచ్చ కెక్కాయి.

Pathan Cheru : పఠాన్ చెరులో రోడ్డెక్కిన పాత కొత్త కాంగ్రెస్ పంచాయితీ!
X

దిశ, వెబ్ డెస్క్ : పఠాన్ చెరు(Pathan Cheru) నియోజకవర్గం(Constituency)లో కాంగ్రెస్(Congress) పార్టీ అంతర్గత కలహాలు(Internal Strife) రచ్చ కెక్కాయి. పార్టీలోని పాత, కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రోడ్డున పడింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy)కి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ క్యాడర్ నిరసనకు పిలుపునిచ్చింది. సేవ్ కాంగ్రెస్ - సేవ్ పఠాన్ చెరు స్లోగన్ తో కార్యకర్తలు, నాయకులు పఠాన్ చెరు చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడ భారీ సంఖ్యలో మోహరించారు.

బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచర వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని పాత కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆరోపిస్తున్నారు. పఠాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను మహిపాల్ రెడ్డి దుర్భాషలాడటంతో వివాదం రాజుకుంది. పార్టీలోని పాత - కొత్త నేతల మధ్య పంచాయితీ సర్దుబాటు చేయాలని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్‌(Kata Srinivas Goud), మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన నీలం మధు ముదిరాజ్‌(Neelam Madhu Mudiraj)లు.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తు్న్నారు.

2018, 2023అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కాట శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గూడెం మహిపాల్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. 2023లో బీఆర్ఎస్, కాంగ్రెస్ టికెట్ లను ఆశించి భంగపడిన నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ లో చేరి మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ నియోజకవర్గంలోని ఆ ముగ్గురు నేతలు దాదాపుగా సమఉజ్జీలు కావడం..ముగ్గురు కాంగ్రెస్ లోనే కొనసాగుతుండటంతో వారి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు తరుచు రచ్చకెక్కుతుంది.

Next Story