- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాచకొండలో ఈ ఏడాది పెరిగిన నేరాలు .. 2025 క్రైమ్ వార్షిక నివేదికలో కీలక విషయాలు
ఇవాళ రాచకొండ 2025 క్రైమ్ వార్షిక నివేదికను సీపీ సుధీర్ బాబు వెల్లడించారు

దిశ, డైనమిక్ బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో (Rachakonda Commissionerate) గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల సంఖ్య పెరిగినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) చెప్పారు. ఇవాళ రాచకొండ 2025 క్రైమ్ వార్షిక నివేదికను (Rachakonda Crime report 2025) ఆయన వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో గత ఏడాది 28,626 కేసులు నమోదు కాగా, 2025లో 33,040 కేసులు నమోదు అయినట్లు చెప్పారు. దోపిడీ 3, దొంగతనాలు 67, ఇళ్లలో చోరీ 589 , వాహనాల చోరీలు 876 , సాధారణ చోరీలు 1, 161, హత్యలు 73 , అత్యాచారలు 330 , వరకట్నం చావులు 12, గృహ హింస కేసులు 782 నమోదైనట్లు వివరించారు. కిడ్నాప్ కేసులు, ఫోక్సో కేసులు సంఖ్య కూడా పెరిగిందని ఈ సంవత్సరం 579 కిడ్నాప్ కేసులు, 1224 ఫోక్సో కేసులు నమోదయ్యాయని, మర్డర్ ఫర్ గెయిన్ కేసులు 3 నమోదైనట్లు తెలిపారు.
మహిళలపై నేరాలు హైక్:
గత ఏడాదితో పోలిస్తే మహిళ పై నేరాలు సంఖ్య 4 శాతం పెరిగిందని ఈఏడాది 20 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కేసుల్లో 668 మంది నిందితులు అరెస్ట్ చేశామన్నారు. 256 డ్రగ్స్ కేసులు నమోదు చేసి ఇందులో 2090 కిలోల గంజాయి, 35 కిలోల గంజాయి చాక్లేట్లు, 34 కేజీల హ్యాష్ ఆయిల్, 216 గ్రాముల ఎండీఎంఏ , 10 కిలోల ఓపీఎస్, 242 గ్రాముల హెరాయిన్ , 35 కిలోల గసగసాల సామాగ్రి సీజ్ చేసినట్లు చెప్పారు.
పెరిగిన కన్విక్షన్ రేటు
ఎక్సైజ్ యాక్ట్ కింద 656 కేసులు నమోదు చేసి 689 మంది అరెస్ట్ చేశామన్నారు. 6824 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. గేమింగ్ యాక్ట్ కింద 227 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. 1,472 మంది అరెస్ట్ చేసి 69 లక్షల ప్రాపర్టీ సీజ్ చేశామన్నారు. మానవ అక్రమా రవాణా కింద ఈ ఏడాది 73 కేసులు నమోదు చేశామని 8 స్థావరాలు గుర్తించామన్నారు. ఈ ఏడాది 5, 647 కేసుల్లో 146 మందికి జైలు శిక్ష ఖరారైందని గత ఏడాది తో పోలిస్తే 74 శాతం కన్విక్షన్ రేటు పెరిగిందన్నారు. ఈ ఏడాది స్పెషల్ ఆపరేషన్ టీమ్ 186 డ్రగ్స్ కేసుల్లో 356 మంది అరెస్ట్ చేసిందని
తగ్గిన సైబర్ క్రైమ్ కేసులు
గత ఏడాదితో పోలిస్తే సైబర్ క్రైమ్ కేసులు తగ్గినట్లు సీపీ వెల్లడించారు. గత ఏడాది 4618 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 3734 కేసులు నమోదయ్యాయని, ఆపరేషన్ ముస్కాన్ కింద 2479 మంది ని రెస్క్యూ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ స్మైల్ 1071 మంది రెస్క్యూ చేశామన్నారు. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని గత ఏడాది 3207 కేసులు నమోదు కాగా, ఈఏడాది 3488 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 659 మందిమృతి చెందారని వివరించారు. కమిషనరేట్ పరిధిలోని ఓఆర్ఆర్ పై జరిగిన ప్రమాదాల్లో 37 మంది మృతి చేందారన్నారు.






