- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Arvind: కేరళలో కూడా మన లిక్కర్ కీర్తి పతాక ఎగిరినట్టుంది !..కవితపై ఎంపీ అర్వింద్ సెటైర్
కవితపై ఎంపీ అర్వింద్ సెటైరికల్ ట్వీట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ లిక్కర్ స్కామ్ (Kerala liquor scam) లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (Kavitha) వస్తున్న ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) సెటైరికల్ ట్వీట్ చేశారు. కేరళలో కూడా మన లిక్కర్ కీర్తి పతాకం ఎగిరినట్టుంది. నాకు మలయాలం అర్థం కాదు. ఈ కేరళ నాయకుడు చెప్పేది మీకు ఎవరికైనా అర్థం అయితే చెప్పండి' అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి బెయిల్ పై బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తాజాగా కేరళ లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి రావడం రాజకీయంగా దుమారం రేపుతున్నది. కేరళలో ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీ వెనుక కవిత పాత్ర ఉందని ఆమె ఏకంగా కేరళ ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపిందని ఆ రాష్ట్ర విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ (VD Satheesan) కేరళ అసెంబ్లీలో చేసిన ఆరోపణలు రచ్చగా మారాయి.






