ఢిల్లీలో కాంగ్రెస్ కీలక భేటీ.. మరి కాసేపట్లో తెలంగాణ CM పేరు ప్రకటన..!

by Disha Web Desk 19 |
ఢిల్లీలో కాంగ్రెస్ కీలక భేటీ.. మరి కాసేపట్లో తెలంగాణ CM పేరు ప్రకటన..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ వేదికగా తెలంగాణ సీఎం అభ్యర్థిపై సీరియస్‌గా కసరత్తు జరుగుతోంది. సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ జాతీయ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ హాజరయ్యారు. సీఎం ఎంపిక బాధ్యతను హై కమాండ్‌కు అప్పగిస్తూ తెలంగాణ సీఎల్పీ చేసిన ఏక వాక్య తీర్మానాన్ని శివకుమార్ ఖర్గేకు అందించనున్నారు. అనంతరం దీనిపై రాహుల్, కేసీ వేణుగోపాల్, ఖర్గే చర్చలు జరిపి.. సీఎం అభ్యర్థి ఎంపికను కొలిక్కి తీసుకురానున్నారు. తెలంగాణ సీఎం క్యాండిడేట్ పేరును ఇవాళ సాయంత్రం ప్రకటించనున్నారు.

అంతకుముందు ఢిల్లీలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు వీరు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం డీకే ఖర్గే నివాసానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సీఎల్పీ చేసిన ఏక వాక్య తీర్మానాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు అందిస్తానని తెలిపారు. సీఎల్పీ తీర్మానంపై ఖర్గేనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

సీఎల్పీ నేత, సీఎం ఎవరనేది ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు. సీఎం ఎంపికలో హై కమాండ్‌దే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. సీఎం ఎంపికలో హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సీఎం ఎవరూ అని మీడియా అడిగిన ప్రశ్నకు నో కామెంట్ అంటూ ఆయన వెళ్లిపోయారు. ఇవాళ సాయంత్రం వరకు సీఎం అభ్యర్థి పేరును అధిష్టానం ప్రకటించనున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read..

BREAKING: తెలంగాణ సీఎం ఎంపికపై మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన



Next Story

Most Viewed