- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూర్తిగా కోలుకునే వరకూ హాస్పిటల్స్‌లోనే ఉంచండి.. అధికారులకు మంత్రి ఆదేశం
కల్తీ కళ్లు తాగి నిమ్స్, గాంధీ హాస్పిటల్స్(Hospital)లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Raja Narasimha) ఆరా తీశారు.

దిశ, వెబ్‌డెస్క్: కల్తీ కళ్లు తాగి నిమ్స్, గాంధీ హాస్పిటల్స్(Hospital)లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Raja Narasimha) ఆరా తీశారు. పేషెంట్ల కండీషన్‌ను డాక్టర్లు మంత్రికి వివరించారు. ప్రస్తుతం నిమ్స్‌లో 35 మంది, గాంధీలో 18 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. నిమ్స్‌లో ఉన్న 35 మందిలో ఐదుగురిని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నామని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు. మిగిలిన 30 మందికి చికిత్స కొనసాగిస్తున్నామని వివరించారు. గాంధీలో ఉన్న 18 మందిలో నలుగురు డయాలసిస్‌పై ఉన్నారని డాక్టర్లు తెలిపారు. మిగిలిన 14 మంది పేషెంట్ల కండీషన్ స్టేబుల్‌గా ఉందని వివరించారు. పేషెంట్లందరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు, డాక్టర్లకు మంత్రి సూచించారు. పూర్తిగా కోలుకునే వరకూ హాస్పిటల్స్‌లోనే ఉంచాలని, ఆ తర్వాతే డిశ్చార్జ్ చేయాలని ఆదేశించారు.






