బిగ్ అలర్ట్: రాగల మూడు గంటల్లో ఈ జిల్లాలో ఈదురుగాలులతో వర్షం..!

by Vemula.Srinu Prasad |

తెలంగాణ జిల్లాలో రాగల మూడు గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది....

బిగ్ అలర్ట్: రాగల మూడు గంటల్లో ఈ జిల్లాలో ఈదురుగాలులతో వర్షం..!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana) జిల్లాలో రాగల మూడు గంటల్లో మోస్తరు వర్షం(Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖప్రకటించింది. అంతేకాదు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల వీచే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్‌(Hyderabad)తో పాటు ఎం.మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్తు సహాయ చర్యలకు సిద్ధం ఉండాలని సూచించారు. తూర్పు విదర్భ నుంచి కర్నాటక వరకు ద్రోణి కొనసాగుతోందని పేర్కొన్నారు.

Next Story