రోగులను గాలికొదిలేసి ఆసుపత్రిలో మెడికోల రీల్స్‌.. నెటిజన్ల ఫైర్

by Prasad Jukanti |

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిని మెడికోలు ఫిల్మ్ స్టూడియోగా మార్చేశారు. ఆపరేషన్ థియేటర్లు, వార్డుల్లో రీల్స్ చేస్తూ వివాదంలో చిక్కుకున్నారు.

రోగులను గాలికొదిలేసి ఆసుపత్రిలో మెడికోల రీల్స్‌.. నెటిజన్ల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొంత మంది తాము ఎక్కడున్నామో మరిచిపోయి సెల్పీలు, వీడియోలతో హల్‍చల్ చేస్తుంటారు. తాజాగా వైద్య విద్యార్థులు కొందరు ఏకంగా ఆసుపత్రిలోనే రీల్స్‌ చేయడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిని రీల్స్ చిత్రీకరించే ఫిల్మ్ స్టూడియోగా మార్చేసిన కొందరు మెడికోలు(Medicos Reels).. తాము డ్యూటీలో ఉన్నామనే సంగతి మరిచిపోయి రీల్స్ పిచ్చిలో మునిగితేలుతున్నారు. పవిత్రంగా చూసుకోవాల్సిన ఆపరేషన్ థియేటర్లలో యంత్రాలపై కూర్చుని రీల్స్ చేస్తున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ రిమ్స్‌ లో (Adilabad RIMS) చోటు చేసుకుంది. ఏకంగా రోగుల వార్డుల్లో సినిమా పాటలకు, సినిమా డైలాగులతో రీల్స్ చేయడం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Next Story