రామోజీరావు మృతి పట్ల ‘దిశ’ యాజమాన్యం సంతాపం

by Gantepaka Srikanth |   (  Updated:2024-06-08 13:54:56  IST  )

ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావు మృతి పట్ల ‘దిశ’ దిన పత్రిక యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

రామోజీరావు మృతి పట్ల ‘దిశ’ యాజమాన్యం సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావు మృతి పట్ల ‘దిశ’ దిన పత్రిక యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణం మీడియా, సినిమా రంగానికి తీరని లోటు అని దిశ ఎండీ మోహన్‌రావు, ఎడిటర్ డి.మార్కండేయ, బ్యూరో చీఫ్ విశ్వనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మీడియా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని రామోజీరావు సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story