- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హైకోర్టులో లైన్ క్లియర్
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు అడ్డు తొలగింది. ఇవాళ హైకోర్టులో జరిగిన వాదనలో కీలక ఆదేశాలు వెలువడ్డాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam Municipality) మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. పీఠంపై విధించిన స్టే ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇవాళ ఎత్తివేసింది. ఎన్నికపై కలెక్టర్ దే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. నిన్న మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వేళ తన తండ్రి కనిపించడం లేదని 19వ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ ఆకుల యాదగిరి కుమారుడు నిన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఈ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. అయితే ఓ వైపు హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా మరోవైపు యాదగిరి నిన్న కౌన్సిలర్‍గా ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ ఎన్నికలోనూ పాల్గొన్నారు. అయితే ఆలోపు ఎన్నిక నిర్వహించవద్దని హైకోర్టు నుంచి ఆదేశాలు రావడంతో ఎన్నిక పూర్తయినా ధ్రువీకరణ పత్రాలు మాత్రం ఎన్నికల అధికారి అందించలేదు.
కోర్టుకు హాజరు:
ఇవాళ విచారణకు ఆకుల యాదగిరిని కోర్టులో హాజరుపరచాలని నిన్నటి విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఇవాళ ఇవాళ కోర్టు విచారణకు కౌన్సిలర్ యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాదనలు వినిపిస్తూ తనను మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు బలవంతంగా తీసుకెళ్లినట్లు యాదగిరి కోర్టుకు తెలిపారు. బపట్ల జిల్లా చీరాల తీసుకువెళ్లారని తాను బీఆర్ఎస్ తరఫున మున్సిపల్ చైర్మన్ రేస్ లో ఉన్నానని అందువల్ల తనను బౌన్సర్లను పెట్టి మానసిసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారని కోర్టుకు వివరించాడు. ఇష్టపూర్వకంగానే ఓటింగ్ వేసినట్లు అందరికీ చెప్పాలంటూ తనను ప్రలోభపెట్టారని అందువల్ల మళ్లీ ఎన్నికను న్యాయబద్ధంగా నిర్వహించాలని కోర్టును కోరారు.యాదగిరి వాదనపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఎన్నికలు పూర్తయ్యే వరకు రక్షణ ఇస్తామని చెప్పింది. అయితే ఇప్పుడు మున్సిపల్ పీఠంపై లైన్ క్లియర్ కావడంతో ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.






