న్యాయవాద వృత్తి సవాళ్లతో కూడుకున్నది.. ‘నల్సార్’ స్నాతకోత్సవంలో సీజేఐ బీఆర్ గవాయ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-12 06:48:42  IST  )

న్యాయవాద వృత్తి సవాళ్లతో కూడకున్నదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (BR Gavai) అన్నారు.

న్యాయవాద వృత్తి సవాళ్లతో కూడుకున్నది.. ‘నల్సార్’ స్నాతకోత్సవంలో సీజేఐ బీఆర్ గవాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: న్యాయవాద వృత్తి సవాళ్లతో కూడకున్నదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (BR Gavai) అన్నారు. ఇవాళ శామీర్‌పేట్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), సుప్రీం కోర్టు జడ్జి పీఎస్ నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో సీజేఐ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ.. న్యాయవాదులు తమను తాము నిరూపించుకోవాలని అన్నారు. న్యాయవాద వృత్తి ఎన్నో కఠినమైన సవాళ్లతో కూడకున్నదని తెలిపారు. కోర్టు తీర్పులకు సంబంధింది ప్రతి ఒక్కరూ సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం న్యాయ విద్యాలో ప్రవేశించే వారి సంఖ్య క్రమంగా పెరగడం సంతోషకరమని అన్నారు. ఏఐ (AI), డేటా ప్రైవసీ (Data Privacy) విషయంలో అనుకూల, ప్రతికూల ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. సరైన మార్గదర్శకత్వం ఉంటేనే వృత్తిలో నైపుణ్యం సాధించగలమని అన్నారు. మెంటార్‌షిప్‌ను ఒక బాధ్యత భావించాలని కొత్తగా పాస్ అవుట్ అయిన విద్యార్థులకు సూచించారు. వృత్తిని, చేసే పనిని ప్రేమించాలని.. అప్పుడే సరైన ఫలితాలు పొందగలుగుతామని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు.

Next Story