కొత్త రాజకీయ పార్టీకి అంకురార్పణ.. పార్టీ జెండా రంగుల చీరలో మెరిసిన కవిత

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-25 03:02:50  IST  )

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీకి అంకురార్పణ చేశారు.

కొత్త రాజకీయ పార్టీకి అంకురార్పణ.. పార్టీ జెండా రంగుల చీరలో మెరిసిన కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇవాళ తన కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి అంకురార్పణ చేశారు. ముహూర్తం ప్రకారం బంజారాహిల్స్‌ (Banjara Hills)లోని తన నివాసంలో ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పార్టీ జెండా రంగుల చీరలో కవిత

పార్టీ ప్రకటనకు ముందు కవిత నివాసం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి ఆమె పూజలు నిర్వహించగా, అనంతరం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ధరించిన చీర అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్త పార్టీ జెండాకు ఎంపిక చేసిన ప్యారెట్ గ్రీన్, డార్క్ బ్లూ అంచుతో ఉన్న రంగులతో (Colors) కూడిన చీరను ఆమె ధరించారు. ఇది ఆమె సిద్ధాంతాలకు, పార్టీ కొత్త అజెండాకు సంకేతమని కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

మేడ్చల్ వేదికగా భారీ బహిరంగ సభ

బంజారాహిల్స్ నివాసం వద్ద పూజల అనంతరం కవిత మేడ్చల్ జిల్లా మున్నేరాబాదు (Munnerabad)లో జరగనున్న భారీ బహిరంగ సభకు బయలుదేరారు. అక్కడే ఆమె తన కొత్త పార్టీ పేరు, జెండా, విధివిధానాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ‘వాయిస్ లేని వారికి గొంతుకగా’ తన పార్టీ నిలుస్తుందని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా సెప్టెంబర్ 2025లో బీఆర్ఎస్ (BRS) పార్టీకి రాజీనామా చేసిన కవిత, ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టి రంగంలోకి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలే తన ప్రధాన లక్ష్యమని ఆమె ప్రకటించడంతో, రాబోయే రోజుల్లో రాజకీయ పోరు మరింత రసవత్తరంగా మారనుంది.

Next Story