- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే చివరి విడత పంచాయితీ ఎన్నికలు
by Muthe.Rajitha |
తెలంగాణలో రేపు తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రేపు తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 182 మండలాల్లోని 4,157 గ్రామ పంచాయతీలు, 28,406 వార్డులకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా ఇందులో ఇప్పటికే 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక డిసెంబర్ 11న జరిగిన తొలి విడత, డిసెంబర్ 14న జరిగిన రెండో విడతల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులే విజయం సాధించారు. సుమారు 60 శాతం కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు గెలుచుకోగా, బీఆర్ఎస్ సుమారు 27 శాతం స్థానాలు దక్కించుకుంది.
Next Story






