హైదరాబాద్ లో అతిపెద్ద మెక్ డొనాల్డ్స్ కేంద్రం

by Muthe.Rajitha |

హైదరాబాద్ కు మరో ఆంతర్జాతీయ దిగ్గజ ఔట్ లెట్ విచ్చేసింది.

హైదరాబాద్ లో అతిపెద్ద మెక్ డొనాల్డ్స్ కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ కు మరో ఆంతర్జాతీయ దిగ్గజ ఔట్ లెట్ విచ్చేసింది. ఆహార రంగంలో ఇంటర్నేషనల్ బ్రాండ్ మెక్ డొనాల్డ్స్ నగరంలో అతిపెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 1.56 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను బుధవారం ప్రారంభించింది. ఈ గ్లోబల్ ఆఫీసును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.

కాగా అమెరికా బయట మెక్ డొనాల్డ్స్ అతిపెద్ద కేంద్రం ఇదేనని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఈ కేంద్రం మెక్ డొనాల్డ్స్ కంపెనీ ఇన్నోవేషన్, ఎంటర్ ప్రైస్ ఆపరేషన్స్ కు గ్లోబల్ హబ్ గా పని చేయనుంది. ఇక ఈ సెంటర్ వల్ల 1200 మందికి ఉపాధి లభించనుంది.

Next Story