- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు పెద్దపీట
రాష్ట్ర బడ్జెట్ లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు పెద్దపీట వేసింది. గతేడాది బడ్జెట్ లో కేటాయించిన రూ.17,677కోట్లకు అదనంగా రూ.230 కోట్లు కేటాయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర బడ్జెట్ లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు పెద్దపీట వేసింది. గతేడాది బడ్జెట్ లో కేటాయించిన రూ.17,677కోట్లకు అదనంగా రూ.230 కోట్లు కేటాయించింది. ఈ సారి కేటాయించిన రూ.17,907కోట్లలో ఎస్టాబ్లిష్ మెంట్ కు రూ.7,458కోట్లు, పథకాలకు రూ.10,450కోట్లు కేటాయించింది. కోర్ అర్బన్ రీజియన్ తోపాటు మున్సిపాలిటీలను అప్ గ్రేడ్ చేసిన మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. లక్ష కంటే తక్కువ జనాభా కల్గిన మున్సిపాలిటీలతోపాటు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించారు. ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీకి ఈసారి రూ.300కోట్లు కేటాయించడం విశేషం. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు, మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టులకు సైతం నిధులు కేటాయించారు. దీంతోపాటు హెచ్ఎండీఏ, జలమండలి ప్రాజెక్టులకు సైతం భారీగానే నిధులు కేటాయించింది.
మున్సిపాలిటీలకు రూ.5వేలకోట్లు
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివ్రుద్ధికి బడ్జెట్ లో రూ.5వేలకోట్లకుపైగా కేటాయించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లు అయినా మహాబుబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెంలకు రూ.1000కోట్లు కేటాయించారు. వరంగల్ నగరానికి రూ.40కోట్లు, ఖమ్మం నగరానికి 15కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. మిగిలిన కార్పొరేషన్లకు మరో రూ.50కోట్లు కేటాయించారు. లక్ష జనాభా కంటే తక్కువగా ఉన్న మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం రూ.1483కోట్లు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా మ్యాచింగ్ గ్రాంట్స్ రూ.1483కోట్లు కేటాయించారు. వీటితోపాటు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మున్సిపల్ మార్కెట్లను పూర్తిచేయడానికి రూ.100కోట్లు కేటాయించారు. మున్సిపల్ వ్యర్థాల నిర్వహణకు రూ.150కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ స్కీమ్ లో భాగంగా ఎస్టీపీల ద్వారా శుద్ది చేసిన నీటి నిర్వహణకు రూ.100కోట్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణకు రూ.30కోట్లు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు రూ.15కోట్లు, శ్మశానవాటికల అభివృద్ది చేయడానికి రూ.10కోట్లు కేటాయించారు. దీంతోపాటు స్వచ్ఛ భారత్ మిషన్ స్కీమ్ లో స్కిల్ డవలప్ మెంట్, కేపాసిటీ బిల్డింగ్ కోసం రూ.54కోట్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ, ఇతర కార్యక్రమాల కోసం కూడా నిధులు కేటాయించారు.
భారత్ ఫ్యూచర్ సిటీకి రూ.300కోట్లు..
హైదరాబాద్ గొప్ప చారిత్రక నగరంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు కలిగి ఉంది. ఆనాటి కుతుబ్ షాహీల నుండి, నిజాం పాలకుల వరకు.. ఆధునిక కాలంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ విమానాశ్రయం వంటి అద్భుతాలతో ఈ నగరం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. 30 వేల ఎకరాలలో ఏర్పాటు చేసే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ రేడియల్ రోడ్ల నిర్మాణం, ఫ్యూచర్ సిటీని నేరుగా ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ వ్యవస్థ, పర్యావరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో ఈ నగరం సుస్థిర అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫ్యూచర్ సిటీకి బడ్జెట్ లో రూ.300కోట్లు కేటాయించారు.






