- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు పునర్జన్మనిచ్చిన నేల.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ పవన్ సంచలన ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan) తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan) తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనసేన (Janasena) పార్టీకి జన్మనిచ్చిన నేల తెలంగాణ అని అన్నారు. తనకు పునర్జన్మను ఇచ్చిన నేల, ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ అని అన్నారు.
మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని కోనియాడారు. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగెపెడుతోన్న సందర్భంగా అన్ని రంగాల్లో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.






