- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీనాక్షితో ముగిసిన భేటీ.. ఎవరికీ భయపడేది లేదని కొండా మురళి ప్రకటన
ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)తో మంత్రి కొండా సురేఖ(Konda Surekha) దంపతుల భేటీ ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)తో మంత్రి కొండా సురేఖ(Konda Surekha) దంపతుల భేటీ ముగిసింది. అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా నెలకొన్న పరిస్థితులన్నీ మీనాక్షికి వివరించాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాల్లో సత్తా చాటుతామని అన్నారు. తన కూతురి పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడే సమయం ఇది కాదని.. కానీ తనకు వచ్చే ఎన్నికల్లో పరకాల బరిలో ఉండాలని ఆలోచనలో ఉంది అని అన్నారు. అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా నిలబడుతుందని చెప్పారు. తాము పార్టీ లైన్ దాటబోమని స్పష్టం చేశారు. అనంతరం కొండా మురళి మాట్లాడుతూ.. తాము ఏ తప్పూ చేయలేదని అన్నారు. అధిష్టానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తాం.. తప్పకుండా చేయకుండా ఎవరికీ భయపడబోం అని ప్రకటించారు.
కాగా, ఇటీవల కాంగ్రెస్ నేతలపై కొండా మురళి(Konda Murali) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో వరంగల్పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. వారితో పాటు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొదటి నుంచీ వీరికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇటీవల వీరంతా కొండా దంపతులపై హైకమాండ్‌కు కంప్లైంట్ చేశారు. దీంతో అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లుంది. ఈ క్రమంలోనే ఇవాళ వారి నుంచి వివరణ తీసుకున్నారు.






