MP Eatala : కులగణన పై ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-18 06:09:38  IST  )

కులగణన(Caste Census)రాష్ట్రాల పరంగా(In terms of states) జరగాల్సిన ప్రక్రియ అని..ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులానికి ఒక్కో రిజర్వేషన్ ఉందని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatala Rajendar) కీలక వ్యాఖ్యలు చేశారు.

MP Eatala : కులగణన పై ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : కులగణన(Caste Census)రాష్ట్రాల పరంగా(In terms of states) జరగాల్సిన ప్రక్రియ అని..ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులానికి ఒక్కో రిజర్వేషన్ ఉందని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatala Rajendar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఈటల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే కమిషన్ వేసి సైంటిఫిక్ గా కులగణన చేయాలని డిమాండ్ చేశారు.

తమిళనాడు చట్టబద్ధ కమిటీ వేసి చేసిందని.. బీహార్ కూడా అలానే చేసిందని గుర్తు చేశారు. కులగణన కాదనలేని సత్యమని..వద్దంటే ఆగేది కాదని..ఏ కులాన్ని విస్మరించలేమని స్పష్టం చేశారు. జనాభా పెరుగుతుంది అనేది సత్యం అని..మరి బీసీ జనాభా ఎలా తగ్గుతుందని..ఇంతకంటే దుర్మార్గపు లెక్కల మోసం ఏముంటుందన్నారు. 2011లో 3.61 కోట్లు ఉన్న రాష్ట్ర జనాభా 4 కోట్లు దాటి ఉంటుందని..అలాంటప్పుడు బీసీ జనాభా 46 శాతం ఉంటుందా ? అని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డికి కులగణన..బీసీ రిజర్వేషన్లపై నిజాయితీ లేదని..బ్లఫ్ చేసి మోసం చేసి లెక్కలు ప్రకటించారని. మోసం చెయ్యకు అని మరోసారి చెప్తున్నానన్నారు. ప్రభుత్వం అంటే డ్రామా కంపనీ కాదని..రిజర్వేషన్లు, కులగణనపై మాట ఇస్తే తప్పవద్దని రేవంత్ కు హితవు పలికారు. ప్రధాని మోదీ మాట ఇస్తే అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు.

సీఎం రేవంత్ ప్రతి నిర్ణయం భూం రాంగ్ అవుతుందని విమర్శించారు. రాహుల్ గాంధీ తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయమని పార్లమెంట్ లో అంటారని..మరీ 1956 నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 45 ఏళ్లు పైగా పాలించింది కాంగ్రెస్ నే కదా అని..ఒక్క బీసీని సీఎంగా ఎందుకు చేయలేదని? ఎవరు అడ్డం వచ్చారని ఈటల నిలదీశారు.

ప్రాంతీయ పార్టీల సోషల్ జస్టిస్ గురించి మాట్లాడలేమని..కానీ జాతీయ పార్టీలు ఎందుకు చేయలేక పోయాయన్నారు. ప్రధాని మోదీ సారధ్యంలో దేశంలో బీసీలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని..రాష్ట్రంలోనూ బీసీ సీఎం ప్రకటన చేశారని ఈటల గుర్తు చేశారు.

Next Story