ధనవంతులు, గుణవంతులకు మధ్య కరీంనగర్‌ పోటీ.. కేంద్ర మంత్రి బండి సంజయ్

by Kema Shiva Kumar |

కరీంనగర్ కార్పొరేషన్‌లో ధనవంతులకు, గుణవంతులకు మధ్య పోటీ జరుగుతోందని.. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

ధనవంతులు, గుణవంతులకు మధ్య కరీంనగర్‌ పోటీ.. కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ కార్పొరేషన్‌లో ధనవంతులకు, గుణవంతులకు మధ్య పోటీ జరుగుతోందని.. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన కరీంనగర్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana)లోనే అత్యధికంగా ఇక్కడ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో సంచులకు సంచులు పైసలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అన్నారు.

కాంగ్రెస్ (Congress) వాళ్లు ఓటుకు రూ.10 వేలు ఇస్తానని చెబుతున్నట్లుగా తెలిసిందని.. వాళ్లకు ఓట్లేస్తే రాబోయే ఐదేళ్ల ఆ పైసలే మళ్లీ తిరిగి సంపాదించుకుంటారని ఆరోపించారు. కానీ, బీజేపీ అభ్యర్థులకు ఓట్లేస్తే.. వారిని కార్పొరేషన్‌ అభివృద్ధి, సమస్యలపై బాజాప్తా ప్రశ్నించే హక్కు ఉంటుందని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేయట్లేదని.. కరీంనగర్ అభివృద్ధికి స్థానికులు సహకరించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తన దగ్గర డబ్బులు లేవని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. మళ్లీ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తే పన్నులు పెంచి ప్రజలపై తీరని భారం మోపుతుందని బండి సంజయ్ ఆరోపించారు.

Next Story