Kaleswaram: నవయుగ సంస్థపై కాళేశ్వరం కమిషన్ తీవ్ర అసనహం

by Prasad Jukanti |

నవయుగ సంస్థపై కాళేశ్వరం కమిషన్ తీవ్ర అసనహం

Kaleswaram: నవయుగ సంస్థపై కాళేశ్వరం కమిషన్ తీవ్ర అసనహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ (PC Ghosh Commission) కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం చేపట్టిన నవయుగ (Navayuga) సంస్థ ప్రతినిధులు ఇవాళ విచారణకు హాజరయ్యారు. మొత్తం నలుగురు ప్రతినిధులు హాజరు కాగా గతంలో వీరు ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా కమిషన్ క్రాస్ ఎగ్జామింగ్ చేస్తోంది. అయితే విచారణ సమయంలో నవయుగ సంస్థపై కాళేశ్వరం కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నవయుగ డైరెక్టర్ రమేశ్ అఫిడవిట్ ను మిగతా ముగ్గురు కాపీ పేస్ట్ చేసినట్లు కమిషన్ గుర్తించింది. అందరి అఫిడవిట్లు ఒకేలా ఉన్నాయని వారి తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సుందిళ్ల బ్యారేజీ (Sundilla) డ్యామేజీ ఎలా? ఎప్పుడు జరిగిందని? డ్యామేజీ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని కమిషన్ ప్రశ్నించింది. 2022లో భారీ వరదలతో మేజర్ డ్యామేజీ జరిగిందని నవయుగ డైరెక్టర్ రమేశ్ కమిషన్ కు వివరించారు. గ్రౌంటింగ్ తో పాటు అన్ని సమయ్లను పరిష్కరించామని డిజైన్ ఆధారంగా డ్యామేజీ తర్వాత రిపేర్లు చేశామని తెలిపారు. పనులు పూర్తయినా ఫైనల్ బిల్లులు ఇంకా ఇవ్వలేదని నవయుగ సంస్థ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లింది.

Next Story