- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాట్ టాపిక్‌గా ఆ ఐఏఎస్ వ్యవహారం.. నెలల కొద్దీ ఫైల్స్ పెండింగ్
సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్.శ్రీధర్ పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్.శ్రీధర్ పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించడంపై ఆయన ఇంట్రెస్ట్ చూపడం లేదని, ఎప్పుడెప్పుడు ఆ శాఖ నుంచి రిలీవ్ అవుదామనే ప్రయత్నంలో ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పలు కీలక నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్నాయని సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్. చివరకు విజిటర్స్ టైమ్‌లో కూడా తన చాంబర్‌లో అందుబాటులో ఉండరని, వివిధ పనుల కోసం వచ్చిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
శాఖపై చులకన భావం?
బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు ఎన్.శ్రీధర్ సింగరేణి సంస్థకు సీఎండీగా వ్యవహరించారు. దీనితో ఆయనకు ఆ పార్టీ లీడర్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని టాక్ ఉంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఆయన్ను ఎస్సీ డిపార్ట్ మెంట్‌కు బదిలీ చేసింది. ఇంతకాలం కీలక సంస్థ బాధ్యతలు చూసిన తనకు అంతగా ప్రయారిటీ లేని శాఖ ఇచ్చారని ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. అందుకే ఆయన ఆ శాఖ వ్యవహారాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని ఆరోపణలు ఉన్నాయి.“సారుకు తమ శాఖ అంటే చులకన భావం. ఎప్పుడు వచ్చిన చాంబర్‌లో ఉండరు. ఎప్పుడైనా ఉంటే కలిసేందుకు టైమ్ ఇవ్వరు. ఒకవేళ కలిసినా చెబుతుంటే వినరు’ అని ఆయన చాంబర్ ముందు ఎదురుచూస్తున్న విజిటర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అర్జెంట్ పైల్స్ మీద ఆయన సంతకం కోసం కింది స్థాయి అధికారులు నానా తంటాలు పడుతున్నారని టాక్. ఆయనకు పలు సార్లు ఫోన్ చేసి విషయాన్ని వివరిస్తే తప్పా సంబంధిత దస్త్రాలపై సంతకాలు చేయరని విమర్శలు ఉన్నాయి.
డేటా ఇవ్వకపోవడంతో కేంద్రం వాటా రాలే..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టూడెంట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నది. గతంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రమే వందశాతం ఫీజును చెల్లించే స్కీమ్ అమల్లో ఉండేది. కానీ, రెండేళ్ల కిందట రాష్ట్రాలు 40 శాతం నిధులిస్తే మిగతా 60 శాతం నిధులను తాము ఇస్తామని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అయితే, ఆ నిధులను నేరుగా స్టూడెంట్స్ బ్యాంకు అకౌంట్‌లో వేస్తామని తెలిపింది. వారి వివరాలు సంబంధిత పోర్టల్‌లో ఎంట్రీ చేయాలని కండీషన్ పెట్టింది. కానీ, ఇంతవరకు ఎస్సీ శాఖ సెక్రెటరీ హోదాలో ఎన్ శ్రీధర్ ఆ విషయం పట్టించుకోలేదు. దీంతో గతేడాది కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.250 కోట్లు అందలేదని ఎస్సీ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పిల్లలకు డ్రెస్సులు అందడం కష్టమే..
ప్రతి ఏటా గురుకులాల్లో కొత్తగా జాయిన్ అయిన పిల్లలకు డ్రెస్సులు, షూస్, ట్రంక్ పెట్టెలు అందిస్తుంటారు. అయితే, వాటిని కొనుగోలు చేయాలంటే సంబంధిత ఫైల్‌ను సెక్రెటరీ హోదాలో శ్రీధర్ క్లియర్ చేస్తేనే టెండర్లు పిలుస్తారు. కానీ, ఇప్పటివరకు ఆ దస్త్రం మీద ఆయన సంతకం చేయలేదని తెలుస్తున్నది. దీనితో గురుకులాలు ప్రారంభమైన వెంటనే పిల్లలకు వస్తువులు అందించడం కష్టం అని చర్చ జరుగుతున్నది.
టైమ్ ఇవ్వకపోవడంతో ప్రోగ్రామ్ రద్దు
ప్రతి సెక్రెటరీ తన శాఖ పరిధిలోని కీలకమైన ప్రోగ్రామ్స్‌కు సీఎంను చీఫ్ గెస్టుగా పిలిచేందుకు ఉత్సాహం చూపుతుంటారు. ప్రతి ఏటా గురుకులాల్లో చదివి మంచి మార్కులు, ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సంస్థకు చెందిన అధికారులు ప్రతిభా ప్రోత్సాహకాలు అందిస్తుంటారు. ప్రస్తుతం ఎస్సీ డిపార్ట్‌మెంట్ సీఎం రేవంత్ వద్దే ఉన్నది. ఈసారి కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి సీతక్కను కూడా ఆహ్వానించారు. ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇన్విటేషన్లు సైతం పంపారు. కానీ, ఎస్సీ వెల్ఫేర్ శాఖ సెక్రెటరీ ఎన్ శ్రీధర్ సీఎంఓతో సమన్వయం చేసుకోకపోవడంతో ఆ కార్యక్రమం కాస్త రద్దు అయినట్లు తెలుస్తోంది.






