- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGSRTC: సికింద్రాబాద్ బస్టాండ్‌లో స్ఫూర్తిదాయక ఘటన.. మానవత్వం చాటిన కండక్టర్
విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న మేడ్చల్ డిపో కండక్టర్ తీరు స్ఫూర్తిదాయకం.

దిశ, డైనమిక్ బ్యూరో: విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న (Medical Depot Conductor) మేడ్చల్ డిపో కండక్టర్ తీరు స్ఫూర్తిదాయకం. (Secunderabad Bus Stand) సికింద్రాబాద్ బస్ స్టేషన్‌లో 229 బస్సు పాయింట్ వద్ద ఒక వ్యక్తి ఫిట్స్ వచ్చి పడిపోయారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న మేడ్చల్ డిపో కండక్టర్ చక్రి బస్సులో నుంచి తాళంచెవి తీసుకొనివచ్చి అతని చేతిలో పెట్టి సహాయం చేశారు. సకాలంలో స్పందించడంతో ఆ వ్యక్తికి ప్రమాదం తప్పింది. ఈ వివరాలను (TGSRTC) టీజీఎస్ ఆర్టీసీ ఆదివారం ఎక్స్ వేదికగా తెలిపింది. వ్యక్తికి ఫిట్స్ వచ్చిన సమయంలో ఎంతో మంది ఉన్నారు కానీ ఒక్కరు కూడా పట్టించుకోలేదని వీడియో లో కండక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఇది గమనించిన తాను వెంటనే వచ్చి సహాయం చేసినట్లు తెలిపారు. ఇక కండక్టర్ తీరుపై ప్రజలు అభినందనలు తెలిపారు. అలాగే ఆర్టీసీ అధికారులు ఆమెను అభినందించారు.






