- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్రటేరియట్లో హౌస్ కీపింగ్ స్టాఫ్ ఆందోళన.. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని నిరసన
by Prasad Jukanti |
తెలంగాణ సెక్రటేరియట్‌లో హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Telangana Secretariat)లో విధులు నిర్వహిస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బందిఆందోళనకు దిగారు. గత మూడు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ సిబ్బంది బుధవారం నిరసన వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన సెక్రటేరియట్ భవనంలోనే తమకు ఈ పరిస్థితి ఎదురుకావడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించడం, ఇండ్ల అద్దెలు కట్టడం కష్టంగా మారిందని, అప్పులు తెచ్చుకుని బతకాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించి తమకు రావాల్సిన మూడు నెలల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ లాంటి కీలక ప్రాంతంలోనే జీతాల కోసం సిబ్బంది రోడ్డెక్కడం ఇప్పుడు రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Next Story






