Historic Decision : చారిత్రాత్మక పథకానికి రేపే శ్రీకారం

by Y. Venkata Narasimha Reddy |

తెలుగు రాష్ట్రా(Telugu States)ల్లో తొలిసారి(First Time)గా ఓ పట్టణంలో 25గంటల పాటు మంచినీటిని అందించే చారిత్రాక(Historic Drinking Water Scheme) పథకం ప్రారంభోత్సవానికి రేపు శ్రీకారం చుట్టనున్నారు.

Historic Decision : చారిత్రాత్మక పథకానికి రేపే శ్రీకారం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రా(Telugu States)ల్లో తొలిసారి(First Time)గా ఓ పట్టణంలో 25గంటల పాటు మంచినీటిని అందించే చారిత్రాక(Historic Drinking Water Scheme) పథకం ప్రారంభోత్సవానికి రేపు శ్రీకారం చుట్టనున్నారు. కరీంనగర్ (Karimnagar)లో 2,660 ఇండ్లకు ఇకపై ప్రతిరోజు 24 గంటలపాటు మంచి నీళ్ల సరఫరా పథకాన్ని రేపు శనివారం హర్యానా మాజీ సీఎం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar), బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar)చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రోజంతా మంచినీరందించే నగరంగా రికార్డు కరీంనగర్ రికార్డు సృష్టించబోతున్నట్లుగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు(Mayor Sunil Rao)వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలోని ఒకటి, రెండు పట్టణాల్లో మాత్రమే ఇటీవల 24 గంటలపాటు తాగునీటి సరఫరా ఇచ్చే కార్యక్రమాలు ప్రారంభయ్యాయని, వాటిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చండీగఢ్ మణిమజ్రా పట్టణంలో గత ఏడాది ఆగస్టులో 24/7 గంటలపాటు తాగునీటిని సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లోని ఏ పట్టణంలో కూడా 24 గంటలపాటు నిరంతరాయంగా మంచి నీటిని సరఫరా చేస్తున్న దాఖలాల్లేవని.. కరీంనగర్ ఆ రికార్డును సాధించబోతోందని పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ లో పైలెట్ ప్రాజెక్టు కింద ఐదు డివిజన్లో 4,055 ఇళ్లకు 24 గంటల పాటు తాగునీటిని అందించాలనే ఆశయం నెరవేరడానికి రేపు అంకురార్పణ జరగబోతోందన్నారు. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్ లు 2,660 ఇళ్లకు 24 గంటల పాటు తాగునీటిని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా..ఆ తరువాత కొద్దిరోజుల్లోనే హౌజింగ్ బోర్డులో పరిధిలోని 4,055 ఇండ్లకు నిరంతరాయంగా మంచి నీళ్లు సరఫరా కానున్నాయని వెల్లడించారు.

దీంతోపాటు కేంద్ర మంత్రులు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కూడా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభిస్తారని, వాటిలో అంబేద్కర్ స్టేడియంలో రూ.22 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, అనుబంధ పనులను, రూ.8.2 కోట్లతో మల్టీపర్సస్ స్కూల్ లో చేపట్టిన పార్క్ పనులను, రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన రాజీవ్ పార్క్ అభివృద్ధి పనులను, నగరంలోని ఆంబోతు వీర్యం కేంద్రం వద్ద పద్మా నగర్ లో రూ.14 కోట్లతో నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ మార్కెట్’ భవనాన్ని, రూ.10.2 కోట్లతో నిర్మించిన స్మార్ట్ క్లాస్ రూమ్ ను, సుభాష్ నగర్ పాఠశాలలో రూ.10.2 కోట్లతో నిర్మించిన స్మార్ట్ డిజిటల్ క్లాస్ ను ప్రారంభించనున్నారు. ఆయా కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు కేంద్ర మంతులతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరుకానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Next Story