- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BC Reservations: మా ఓపికను పరీక్షించకండి.. పిటిషనర్ తరఫున లాయర్‍పై సీజే ఆగ్రహం
తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై వాదనలు జరిగాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్లపై (BC Reservation) తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. లంచ్ విరామం అనంతరం వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో పిటిషన్ తరఫు లాయర్ సుదర్శన్ తీరుపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. మా ఓపికను పరీక్షించవద్దని సీజే మండిపడ్డారు. వాదనల సమయంలోయయ బీసీల్లో వర్గాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు జరగలేదన్న మరో పిటిషనర్ లాయర్ సుదర్శన్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. స్పందించి సీజే జస్టిస్ ఏకే సింగ్ ఇదే చివరి విచారణ కాదు.. అన్ని అంశాలు ప్రస్తావించొద్దు.. మా ఓపికను పరీక్షించకండి.. గంటల కొద్ది అదే అంశాన్ని ప్రస్తావించి మా సమయం వృథా చేయొద్దని మండిపడ్డారు.
పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేస్తాం:
ప్రభుత్వం తరఫున వాదనలు నిపించిన అభిషేక్ సింఘ్వీ.. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నంబర్ 9పై నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరారు. ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. చట్టసభలు చేసిన చట్టాలను గవర్నర్లు త్రిశంకుస్వర్గంలో ఉంచుతున్నారు. గర్వర్లు బిల్లులపై నెలలపాటు ఏ నిర్ణయమూ చెప్పటం లేదు. కనీసం బిల్లులను ఆమోదించడం, తిరస్కరించడం, తిప్పిపంపించడే లేదని కోర్టుకు తెలిపారు. ప్రజల ద్వారా ఎన్నికైన చట్టసభలు చేసే చట్టాలను గవర్నర్ ఆమోదించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. తమిళనాడులో ఒక బిల్లు ఐదేళ్లు గవర్నర్ వద్దే ఉంది. ఆర్డికల్ 200ను గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారు. గవర్నర్లు నిర్ణయం తీసుకోకపోవటంతో వ్యవస్థ స్తంభించిపోతోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారన్నారు. ఒకటి కాదు ఆరునెలలుగా గవర్నర్ ఈ బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గవర్నర్ల చర్యల వల్ల ప్రభుత్వాలు ప్రజల ఆంకాంక్షలను నెరవేర్చలోకపోతున్నాయని ఇటువంటి తరుణంలో స్టే ఇవ్వడం సరికాదన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే బీసీ బిల్లు చేశారు. జీవో తెచ్చారన్నారు.






