- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కారు కీలక నిర్ణయం.. వాళ్ళ పెన్షన్లు కట్
by Muthe.Rajitha |
తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులైన పెన్షనర్లను ఏరిపారేసింది. పేదలకు అందాల్సిన పెన్షన్లు పక్కదారి పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి రాగా.. ప్రభుత్వం సోషల్ అడిట్ మరింత కఠినంగా చేయాలని ఆదేశించింది. ఈ ఆడిట్ లో వేలాది పెన్షన్లు అనర్హులకు అందుతున్నట్టు తేల్చింది. ప్రస్తుతం వీరందరికీ పెన్షన్లు కట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వం ముందుగా పైలట్ ప్రాజెక్టుగా 4 జిల్లాల్లో 20 వేల శాంపిల్స్ వడపోయగా.. అందులో 2 వేళా మంది అనర్హులుగా తేలింది. ధనవంతులు, 50 ఏళ్ళు నిండని వాళ్ళు, వైకల్యం లేకున్నా దివ్యాంగ పెన్షన్లు, చనిపోయినవాళ్లపై ఇతరులు అక్రమంగా ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు అన్ని జిల్లాలలకు విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Next Story






