ఆ చారిత్రక తప్పిదం ప్రభుత్వం చేయొద్దు.. మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-30 12:32:40  IST  )

తెలంగాణ శాసన మండలిలో ఉద్యమకారుల సంక్షేమంపై ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆ చారిత్రక తప్పిదం ప్రభుత్వం చేయొద్దు.. మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యే రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమంపై శాసన మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి (MLC Vijayashanthi) తన వాయిస్ వినిపించారు. ప్రభుత్వంపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇవాళ ఆమె సభలో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే, ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఉండేవారా అని ప్రశ్నించారు. పదవుల కంటే ముందు వారి త్యాగాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలతో పాటు వివిధ సందర్భాల్లో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పనిసరిగా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

చారిత్రక తప్పిదం చేయవద్దు..

ఉద్యమకారులను ఆదుకోవడమనేది ప్రభుత్వ తప్పనిసరి బాధ్యత అని విజయశాంతి అన్నారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) సక్రమంగా నిర్వర్తిస్తే అది చరిత్రగా నిలుస్తుంది.. లేని పక్షంలో వారిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన గౌరవం, పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని విజయశాంతి ప్రభుత్వానికి సూచించారు.

Next Story