- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి ..
రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి ..
- రాజకీయ ఉనికి కోసమే ప్రతిపక్షాల ఆరోపణలు
- రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
దిశ వరంగల్ బ్యూరో : రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. హనుమకొండ రామ్ నగర్ లోని తమ నివాసంలో శనివారం ప్రజల నుంచి విజ్ఞప్తులను వినతులను స్వీకరించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని రంగురంగుల బ్రోచర్లలో వీడియోలో చూపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని క్షేత్రస్థాయిలో చేసి చూపెడుతుందని మంత్రి సురేఖ తెలిపారు. ప్రతిపక్షాలు వాళ్ల రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధి మాత్రం వాళ్ల కళ్ళకు కనిపించడం లేదని అన్నారు.ప్రజా సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చూపడం ప్రజాపాలనకు నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిచే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఏ సమస్యలు ఉన్న ప్రజలు నిరభ్యంతరంగా తనను సంప్రదించవచ్చునని ప్రజలకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.






