గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యం తగ్గింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-11 12:32:38  IST  )

యాదాద్రి భువనగిరి జిల్లాకు నీళందించే గంధమల్ల రిజర్వాయర్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..

గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యం తగ్గింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District)కు నీళందించే గంధమల్ల రిజర్వాయర్(Gandhamalla Reservoir) విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించింది. 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు రిజర్వాయర్ నిర్మాణ పనులకు రూ. 575.55 కోట్లతో అనుమతులను సైతం మంజూరు చేసింది.

కాగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల వద్ద 9.36 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌‌ను నిర్మించాలని 2017లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ, నిర్మాణ పనుల ప్రక్రియను ప్రారంభించింది. అయితే భారీగా భూసేకరణ చేయాల్సి వస్తోంది. దీంతో రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 టీఎంసీలకు కుదించింది. అయితే ముంపు గ్రామాల నుంచి ఇంకా నిరసన వ్యక్తంకావడంతో 1.41 టీఎంసీలకు కుదించాలని కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం కూడా 1.41 టీంఎసీల ప్రతిపాదనను చేసింది. ఇందులో భాగంగా రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Next Story