- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: హైడ్రాకు నిధులు విడుదల చేసిన సర్కార్
హైడ్రాకు బడ్జెట్ కేటాయింపులో భాగంగా రూ.25కోట్లు విడుదల చేస్తూ హైదరాబాద్ మెట్రో పాలిటన్ ఏరియా, అర్బన్ డవలప్ మెంట్ కార్యదర్శి కె.ఇలంబర్తి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రాకు బడ్జెట్ కేటాయింపులో భాగంగా రూ.25కోట్లు విడుదల చేస్తూ హైదరాబాద్ మెట్రో పాలిటన్ ఏరియా, అర్బన్ డవలప్ మెంట్ కార్యదర్శి కె.ఇలంబర్తి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో హైడ్రా ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిన విషయం విషయం తెలిసిందే. అందులో భాగంగానే గతంలో విడుదల చేసిన రూ.25కోట్లతో కలిపి ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.50కోట్లు విడుదల చేసింది. మరో రూ.50కోట్లు విడుదల చేయాల్సి ఉందని ఉత్తర్వులో పేర్కొన్నారు.
హైడ్రా హీరోలకు కమిషనర్ సన్మానం
దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని చాకచక్యంగా కాపాడిన హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది తిరుపతి యాదవ్, సంతోష్ చారి, మహ్మద్ ఇమ్రాన్‌లను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ అభినందించారు. ఈ నెల 25న రామిరెడ్డి అనే యువకుడు తీగల వంతెన అంచున నిలబడి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. అక్కడ విధుల్లో ఉన్న డీఆర్ ఎఫ్ సిబ్బంది కాపాడిన విషయం అందరికీ విధితమే. రామిరెడ్డిని మాటల్లో పెట్టి.., దృష్టి మరల్చి.. క్షణాల్లో కాపాడిన తిరుపతి యాదవ్‌ను కమిషనర్ అభినందించారు. అలాగే అక్కడ విధుల్లో ఉండి.. యువకుడిని కాపాడేందుకు సహకరించిన సంతోష్ చారి, మహ్మద్ ఇమ్రాన్‌లను కూడా శాలువ కప్పి సన్మానించారు. దుర్గం చెరువు వంతెనపై నీరు నిలబడకుండా.. రంద్రాలను శుభ్రం చేస్తున్నప్పుడు ఓ యువకుడు దూకేందుకు యత్నిస్తున్న దృశ్యాలను చూశామని.. ఒకవైపు అతడిని దూకవద్దు అని మాటల్లో పెట్టి... మరో వైపునుంచి వచ్చి కాపాడినట్టు ఆ ముగ్గురు డీఆర్ ఎఫ్ ఉద్యోగులు కమిషనర్‌కు వివరించారు.






