TS: 2910 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Disha Web Desk 2 |
TS: 2910 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 2910 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు గ్రూప్ –1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్ –2 కింద కూడా 663 ఉద్యోగాలు, గ్రూప్​–3 లో 1373 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఈ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల్లో భాగంగా 52 వేల కొలువుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చినట్లైంది. కాగా, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మార్చి నుంచి ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్లుగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. మిగతా ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలోనే అనుమతి ఇవ్వనున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా చెప్పారు.

తాజాగా అనుమతి వచ్చిన పోస్టులు

గ్రూప్​–2 ఉద్యోగాలు భాగంగా జీఏడీ ఏఎస్వో పోస్టులు 165, పంచాయతీరాజ్ ఎంపీవో పోస్టులు 125, డిప్యూటీ తాసీల్దార్​ 98, ఎక్సైజ్ ఎస్ఐ 97, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 59, చేనేత ఏడీవో 38, ఆర్థిక శాఖ ఏఎస్​వో 25, అసెంబ్లీ ఏఎస్​వో 15, గ్రేడ్​ –2 సబ్ రిజిస్ట్రార్ 14, గ్రేడ్ –3 మున్సిపల్ కమిషనర్ 11, ఏఎల్​వో 9, న్యాయశాఖ ఏఎస్​వో 6 పోస్టులున్నాయి.

ఇక గ్రూప్​–3లో మొత్తం 1373 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 99 విభాగాల హెచ్​ఓడీ కేటగిరీల పరిధిలో 1,373 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. వ్యవసాయశాఖలో 199 గ్రేడ్ -2 ఏఈవో పోస్టులు, 148 ఏవో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉద్యానవన శాఖలో 21 హార్టీకల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సహకారశాఖలో 63 అసిస్టెంట్ రిజిస్ట్రార్, 36 జూనియర్ ఇన్స్​పెక్టర్​పోస్టులున్నాయి. పశుసంవర్ధక శాఖలో 183 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, 99 వెటర్నరీ అసిస్టెంట్ సహా 294 పోస్టులకు ఫైనాన్స్​నుంచి అనుమతి వచ్చింది. విత్తన ధృవీకరణ సంస్థలో 19 సర్టిఫికేషన్ అధికారి, ఆరు ఆర్గానిక్ ఇన్స్పెక్టర్ పోస్టులు, మత్య్సశాఖలో తొమ్మిది ఎఫ్​డీఓ, నాలుగు ఏడీ, రెండు అసిస్టేంట్​ఇన్స్​పెక్టర్​ పోస్టులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్​ పరిధిలో 12 పోస్టులు, ఇంధనశాఖలో 11 సహాయ ఎలక్ట్రికల్ పోస్టులు, గిడ్డంగుల సంస్థలో 28 ఏడబ్ల్యూఎం, 14 మేనేజర్ సహా 50 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Next Story

Most Viewed