విద్యార్థులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ ఫీజు మొత్తం ప్రభుత్వమే కట్టాలని నిర్ణయం

by Disha Web Desk 19 |
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ ఫీజు మొత్తం ప్రభుత్వమే కట్టాలని నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాలు ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ వర్సిటీలు సహా 200కు పైగా ఇనిస్టిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి పూర్తి ఫీజు (ఆర్టీఎఫ్) చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో మంగళవారం మంత్రి గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫీజులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అన్నిరంగాల్లో వెనుకబడిన వర్గాలు అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండేదని ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీలకు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 10వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఏటా 150కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్పులతో పాటు రాష్ట్రంలోనూ ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని తెలిపారు.


Next Story