- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖర్చులో 20% ఆదాయం చూపాల్సిందే.. అప్పుడే వెయ్యి మార్కులు సొంతం!
కోర్ అర్బన్ రీజియన్ యూనిట్‌గానే స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025లో జీహెచ్ఎంసీగా పరిగణించి కేంద్రం ర్యాంకులు ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ యూనిట్‌గానే స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025లో జీహెచ్ఎంసీగా పరిగణించి కేంద్రం ర్యాంకులు ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. జీహెచ్ఎంసీలోని పాత 150 వార్డుల ఆధారంగానే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అయితే జీహెచ్ఎంసీలో విలీనమైన 27 యూఎల్బీలకు సంబంధించిన వివరాలన్నీ సీడీఎంఏ పరిధిలో ఉండడంతో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే జీహెచ్ఎంసీలో 27 యూఎల్బీలను విలీనం చేయడంతో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీగా మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి పాత జీహెచ్ఎంసీగా పరిగణించి ర్యాంకులు ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచి మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా పరిగణించనున్నారు.
మార్కులు ఇలా..
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆయా అంశాలకుగాను 12,500 మార్కులు ఉంటాయి. వీటిలో మొదటి 10,500 మార్కుల్లో పారిశుధ్య నిర్వహణ, ఇంటింటిలో తడి, పొడి చెత్త వేరు చేయడం, ఫ్లైఓవర్లకు పేయింటింగ్ పనులు, వర్టికల్ గార్జెన్స్ నిర్వహణ, ఇతర కార్యక్రమాలు సైతం ఉంటాయి. మరో 1000 మార్కుల్లో వాటర్ ఫ్లస్ కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా టాయిలెట్ల నిర్వహణ, ఎస్టీపీలు పనిచేసేవిధానం, సీవరేజ్ క్లీన్ చేసే జెట్టింగ్ మెషిన్ల పనితీరు వంటి కార్యక్రమాలు ఉన్నాయి. వీటితోపాటు మరో 1000 మార్కుల్లో గార్బేజ్ ఫ్రీ సిటీ ప్రొటోకాల్‌లో భాగంగా ఆదాయ మార్గాలపై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. చెత్త డిస్పోజల్‌లో భాగంగా చెత్త విద్యుత్, కాంపోస్టింగ్, డీఆర్సీ సెంటర్ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? ఎస్టీపీ ద్వారా శుద్ధిచేసిన నీటి ద్వారా ఏమైనా ఆదాయం వస్తుందా? అనే అంశాలను పరిశీలించనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చేస్తున్న ఖర్చులో కనీసం 20 శాతం ఆదాయం వస్తే 1000 మార్కులు వేయనున్నారు.
మంథని, చేర్యాల మున్సిపాలిటీలకు..
స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగానే భూపాలపల్లి జిల్లాలోని మంథని, సిద్డిపేట జిల్లాలోని చేర్యాల మున్సిపాలిటీలకు జీహెచ్ఎంసీ మెంటార్‌గా వ్యవహరిస్తోంది. ఈ రెండు మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. సర్వేక్షణ్‌కు కావాల్సిన అన్ని రకాల కార్యక్రమాలను సీరియస్‌గా నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సారి ఈ రెండు మున్సిపాలిటీలకు ర్యాంకులు పక్కాగా వస్తాయని అధికారులు చెబుతున్నారు.






