జిల్లా ఆసుపత్రుల స్టాఫ్ ​రెగ్యులరైజేషన్​.. వివరాలు కోరిన సర్కార్

by Dishafeatures2 |
జిల్లా ఆసుపత్రుల స్టాఫ్ ​రెగ్యులరైజేషన్​.. వివరాలు కోరిన సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జిల్లా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్​ను రెగ్యులరైజేషన్ ​చేసేందుకు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇంచార్జీ కమిషనర్​డాక్టర్​వి రమేష్​ కుమార్​ అన్ని దవాఖాన్ల అధికారులను వివరాలు కోరుతూ సోమవారం ఓ సర్క్యూలర్​రిలీజ్​చేశారు. విభాగాల వారీగా సిబ్బంది వివరాలు ఇవ్వాలన్నారు. పేరు, కేడర్​, పనిచేస్తున్న ఆసుపత్రి, కాంట్రాక్ట్​లో ఉద్యోగం పొందిన అపాయింట్ మెంట్ ఆర్డర్ తో పాటు ప్రో ఫామ్​ లో అడిగిన వివరాలన్నీంటిని పూర్తి చేసి టీవీవీపీ ప్రధాన కార్యాలయానికి పంపించాలని కమిషనర్​కోరారు.


Next Story