- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచ స్థాయి సంస్థల్లో ఉద్యోగాల కల్పనే లక్ష్యం : ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడి
డా. బీ. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అభ్యసించే విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించి, ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐఓఎన్ (టీసీఎస్ ఐఓఎన్) తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: డా. బీ. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అభ్యసించే విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించి, ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐఓఎన్ (టీసీఎస్ ఐఓఎన్) తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడించారు. మంగళవారం డా. బీ. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో వీసీ ఆచార్య ఘంటా చక్రపాణి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణా దుండిగల్ల ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా వీసీ ఆచార్య ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా 2025-26 విద్యా సంవత్సరం నుండి బి.ఎ, బికామ్, బిఎస్సీ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ బీఆర్ఏఓయూ-టీసీఎస్ అయాన్ ఇంటిగ్రేటెడ్ జాబ్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్"లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కోర్సును "ఆన్‌లైన్", "టీసీఎస్ అయాన్ డిజిటల్ లెర్నింగ్ హబ్", లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అభ్యసించే అవకాశం ఉంటుందని వివరించారు.
నిపుణులతో రికార్డ్ చేసిన వీడియోలు, చర్చా వేదికలు, లైవ్ చాట్, ఇండస్ట్రీ అసైన్‌మెంట్‌లు, మాడ్యులర్ ప్రాక్టీస్ ప్యాకేజీలు, మెంటరింగ్‌తో కూడిన ఇండస్ట్రీ ప్రాజెక్ట్‌లు ఈ ప్రోగ్రామ్‌లో భాగమని తెలిపారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారిలో కనీసం 70 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రొ. ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి మాట్లాడుతూ నూతనంగా రూపొందించిన ఈ సరికొత్త ప్రోగ్రాం విద్యార్థులు మంచి సంస్థల్లో ఉద్యోగం పొందేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
రిజిస్ట్రార్ డా. ఎల్ విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ, నిరుపేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో నైపుణ్యాలు పెంచి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం ఈ కోర్సుపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎంఆర్ఆర్ సి డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కో ఆర్డినేటర్ ప్రొ. పల్లవీ కాబ్డే, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా. వేణు గోపాల్ రెడ్డి, ఇతర విశ్వవిద్యాలయ అధికారులు, టీసీఎస్ అధికారులు రవీంద్ర కెంభావి, లీనా టిప్రే, సతీష్ తదితరులు పాల్గొన్నారు.






