- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి రోజు ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు.. కానీ అక్కడ మాత్రం..!
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయం వెల్లడించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ (కాపీయింగ్) కేసులు నమోదు కాలేదని వెల్లడించింది. శనివారం జరిగిన మొదటి పరీక్షకు 99.65శాతం విద్యార్థుల హాజరైనట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ విద్యార్థులు మొత్తం 5,17,197మంది రిజిస్టర్ కాగా, 5,15,374 మంది పరీక్షకు హాజరు కాగా, 1,823మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విధానం ద్వారా రాసే విద్యార్థులు 786 మంది ఉండగా వారిలో 626 మంది హాజరు కాగా 160 మంది గైర్హాజరైనట్లు పేర్కొంది. 1240 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్, ఇతర సిబ్బందితో పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించినట్లు వివరించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు సిబ్బందిని విధులకు దూరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయం తెలిపింది.






