- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మంటలు అదుపులోకి.. హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతి
నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాద ఘటనలో మంటలు అదపులోకి వచ్చినట్లుగా ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాద ఘటనలో మంటలు అదపులోకి వచ్చినట్లుగా ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తమకు ఉదయం 10 గంటలకు సమాచారం వచ్చిందన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాద జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైలు ఎవిడెన్స్ లాబరేటరీ మొత్తం ఇక్కడ నుండే ఆపరేషన్ జరుగుతుందని అన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏం తగులబడ్డాయో ఇంకా స్పష్టత లేదని తెలిపారు. 5 ఫైరింజర్ల సాయంతో మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పని చేస్తున్న వార్డు బాయ్ కృష్ణ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, అతడిని చికిత్స నిమిత్తం 108లో హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు నలుగురు ఉద్యోగులు లోపల ఉన్నారని, వారు మంటలు గమనించి సురక్షితంగా బయటి వచ్చేశారని ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు.
విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతి..
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో మంటలు అదుపులోకి వచ్చాయని, మొదటి అంతస్తులోని వివిధ కేసులో ఉన్న సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించిందని ఫైర్ డీఎఫ్‌వో శ్రీరామ్ దాస్ వెల్లడించారు. చాలా విలువైన హార్డ్ డిస్కులు డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంపై తమకు ఉదయం 10.30కి సమాచారం అందిందని అన్నారు. ఆ తర్వాత వెంటనే తాము స్పాట్‌కు చేసుకున్నామని వివరించారు. కెమికల్ లాబ్ మెటీరియల్ అంతా రెండో అంతస్తులో ఉందన్నారు. మొదటి అంతస్తులో సెన్సిటివ్‌గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయని, రెండో అంతస్తులో ఉన్న కెమికల్ ల్యాబ్‌కు ఎలాంటి ప్రమాదం లేదన్నారు.






