కాళేశ్వరం రిపోర్టుపై తుది నిర్ణయం సర్కార్‌దే.. మీడియాతో చిట్‌చాట్‌లో జస్టిస్ చంద్రఘోష్‌

by Kema Shiva Kumar |

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ చేపట్టిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ (Justice Pinaki Chandraghosh) కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదికను అందజేసింది.

కాళేశ్వరం రిపోర్టుపై తుది నిర్ణయం సర్కార్‌దే.. మీడియాతో చిట్‌చాట్‌లో జస్టిస్ చంద్రఘోష్‌
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ చేపట్టిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ (Justice Pinaki Chandraghosh) కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదికను అందజేసింది. ఈ మేరకు ఇవాళ బీఆర్కే భవన్‌ (BRK Bhavan)లోని కమిషన్ కార్యాలయంలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా (Rahul Bojja)కు రెండు సీల్డ్ కవర్లలో జస్టిస్ చంద్రఘోష్ నివేదికను హ్యాండోవర్ చేశారు. ఇవాళ సాయంత్రం కాళేశ్వరం రిపోర్టు సీఎస్‌ రామకృష్ణారావు (CS Rama Krishna Rao) వద్దకు చేరనుంది. రేపు ఉదయం జస్టిస్ చంద్రఘోష్ తమ హోం సిటీ కోల్‌కతా (Kolkata)కు తిరుగు ప్రయాణం కానున్నారు.

ఈ క్రమంలోనే ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఇవాళ్టితో కాళేశ్వరంపై కమిషన్ విచారణ ముగిసిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి మొత్తం 650 పేజీలకు పైగా తుది నివేదిక అందజేశామని పేర్కొన్నారు. కమిషన్ ఆర్డర్ ప్రకారం తుది రిపోర్టు (Final Report) ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని నొక్కి చెప్పారు. కాళేశ్వరంపై నివేదిక ఇవ్వడమే తమ పని అని.. సర్కార్ ఆ అంశపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తనకు తెలియదని కాళేశ్వరం కమిషన్‌ చీఫ్‌ చంద్రఘోష్‌ కామెంట్ చేశారు.

Next Story