- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.... ఆ జిల్లాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ఎండలు ముదురుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువ అయ్యాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ప్రథమార్థంలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువ కావడంతో ప్రజలు ఎండ వేడికి అల్లాడిపోతున్నారు. రోజురోజుకూ ఎండలు ఉగ్రరూపానికి చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇవాళ 38 డిగ్రీ మేర ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది వేసవి తీవ్రత ముందుగానే మొదలు కానుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గతంలోనే హెచ్చరించినా భానుడి ప్రతాపానికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టాలంటే జంకే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నిజామాబాద్ టాప్:
రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జనకంపేటలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనాలో 38.6 డిగ్రీలు, మబబూబ్ నగర్ దేవరకొండలో 38.6 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొహినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 38.6, సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్‍లో 38.6 డిగ్రీలు నమోదు అయింది. అత్యల్ప ఉష్ణోగ్రత యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో 36.7 డిగ్రీలు నమోదు అయింది.
ఇవాళ తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు (జిల్లాల వారీగా)
నిజామాబాద్ – 38.8°C (యెడపల్లె – జనకంపేట్)
జగిత్యాల – 38.6°C (ధర్మపురి – జైనా)
మహబూబ్‌నగర్ – 38.6°C (దేవరకద్ర)
రంగారెడ్డి – 38.6°C (మొయినాబాద్ – రెడ్డి పల్లి)
సంగారెడ్డి – 38.6°C (కొహీర్ – దిగ్వాల్)
భద్రాద్రి కొత్తగూడెం – 38.5°C (భద్రాచలం)
నిర్మల్ – 38.5°C (దస్తూరాబాద్)
ఆదిలాబాద్ – 38.4°C (భోరాజ్)
జోగులాంబ గద్వాల్ – 38.4°C (ఆలంపూర్)
కామారెడ్డి – 38.4°C (బీర్కూర్)
కుమురం భీమ్ ఆసిఫాబాద్ – 38.4C (కెరమెరి)
మంచిర్యాల – 38.4°C (భీమారం)
నాగర్‌కర్నూల్ – 38.4°C (పెంట్లవెల్లి)
వనపర్తి – 38.4°C (మదనాపూర్)
జయశంకర్ భూపాలపల్లి – 38.3°C (మహాదేవపూర్)
మెదక్ – 38.3°C (శంకరంపేట)
నల్గొండ – 38.3°C (మడుగులపల్లి)
పెద్దపల్లి – 38.3°C (అంథర్గాం)
వికారాబాద్ – 38.3°C (బంట్వారం)
హనుమకొండ – 38.1°C (ధర్మసాగర్)
జనగామ – 38.0°C (పాలకుర్తి)
నారాయణపేట – 38.0°C (చిన్నజాత్రం)
ములుగు – 37.9°C (వాజేడు)
ఖమ్మం – 37.7°C (మాధిరా)
సూర్యాపేట – 37.6°C (మెల్లచెర్వు)
రాజన్న సిరిసిల్ల – 37.5°C (రుద్రంగి)
సిద్దిపేట – 37.5°C (సిద్దిపేట అర్బన్)
వరంగల్ – 37.5°C (ఖిల్లా వరంగల్)
మేడ్చల్-మల్కాజిగిరి – 37.4°C (కాప్రా)
హైదరాబాద్ – 37.2°C (సికింద్రాబాద్ – మొండామార్కెట్)
మహబూబాబాద్ – 37.2°C (డోర్నకల్)
కరీంనగర్ – 36.9°C (జమ్మికుంట)
యాదాద్రి భువనగిరి – 36.7°C (భువనగిరి)






