- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌కు జనం కర్రుకాల్చి వాత పెట్టడం తథ్యం.. బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం
బీజేపీ (BJP) సభలు, రోడ్ షోలకు పర్మీషన్లు ఇస్తే ఓ వర్గం ఓట్లు పోతాయనే భయం కాంగ్రెస్ (Congress)కు పట్టుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ (BJP) సభలు, రోడ్ షోలకు పర్మీషన్లు ఇస్తే ఓ వర్గం ఓట్లు పోతాయనే భయం కాంగ్రెస్ (Congress)కు పట్టుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రహమత్‌నగర్ (Rahmatnagar)లో నిర్వహించబోయే ఆయన మీటింగ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో మరోసారి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక అనుమతిని ఇవ్వడం లేదంటూ చెప్పడం ఏంటని ప్రశ్నించారు.
తాము ఈ నెల 4న మీటింగ్ అనుమతివ్వాలని పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నామని, ఆ విషయంపై ఇప్పటి దాకా నాన్చడం వెనుక ఉన్న మతలబు ఏందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) పార్టీలు ఏకమై గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ సభలకు పర్మీషన్లు ఇస్తూ.. తమ సభలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ సభలు, రోడ్ షోలకు పర్మీషన్లు ఇస్తే ఎక్కడ ఓ వర్గం ఓట్లు పోతాయనే భయం కాంగ్రెస్‌కు పట్టుకుందని అన్నారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఓటర్లు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని.. కాంగ్రెస్‌కు కర్రు కాల్చివాత పెట్టడం తథ్యమని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు.
Read More... మాది మీ సంస్కృతి కాదు.. బీఆర్ఎస్ నేతల ఇండ్లలో సోదాలపై మంత్రి పొన్నం రియాక్షన్ ఇదే






