- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో గెలిచింది వీరే..!
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి....

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఓట్ల(Hyderabad Film Chamber Election Votes) లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి జరిగిన ఎన్నికల్లో మొత్తం 43 శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 3,287 ఓట్లకు గాను ఈ ఎన్నికల్లో 1421 మాత్రమే నమోదు అయ్యాయి. రెండు సెక్టార్లలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. స్టూడియోస్ సెక్టార్‌లో మన ప్యానల్‌కు సంబంధించి ముగ్గురు ఈసీ మెంబర్లుగా గెలుపొందారు. ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి ఒకరు ఈసీ మెంబర్‌గా విజయం సాధించారు.
ఎగ్జిబిటర్స్ సెక్టార్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఈసీ మెంబర్లుగా వంశీకిషోర్, అనుపమ్ రెడ్డి, డి. సురేశ్ బాబు, వంశీ నందిపాటి, వీరనారాయణ, విజయేందర్ రెడ్డి, సాంబమూర్తి, పి.శ్రీనివాసరావు, రాజేశ్వర్ రెడ్డి,గిరిధర్ బాబు, రామలింగస్వామి, బాలరత్నం, బాలగోవింద్, మహేశ్వర్ రెడ్డి, అప్పలరాజు, శ్రీనాథ్ పోటీ చేశారు. అయితే ప్రోగ్రెసివ్ ప్యానల్ అధిక్యం కనబర్చింది. డి. సురేశ్ బాబు ప్యాన్‌లనుంచి 14 మంది విజయం సాధించారు. అందులో సురేశ్ బాబు సైతం ఈసీ మెంబర్‌గా గెలుపొందారు. మరో రెండు ఈసీ మెంబర్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిక్యూటివ్ ప్యానల్ నుంచి కూడా అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈ ప్యానల్‌లో సురేశ్ బాబు అధిక్యం కనపడింది.
డిస్ట్రిబ్యూటర్, నిర్మాతల సెక్టార్స్‌కు సంబంధించిన కౌంటింగ్ సైతం పూర్తి అయింది. అయితే టెక్నికల్ సమస్య వల్ల రీ కౌంటింగ్ కోరడంతో లెక్కింపు ప్రక్రియ మళ్లీ కొనసాగుతోంది. ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి అగ్ర నిర్మాతలు, మన ప్యానల్ నుంచి చిన్న నిర్మాతలు పోటీ చేయడంతో ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. దీంతో అధ్యక్షుడి ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. నాలుగు సెక్టార్లలో పోటీ చేసిన 44 మంది ఈసీ మెంబర్లు ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో అధ్యక్షుడిని, నలుగురు చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈసారి ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా డి. సురేశ్ బాబును ఎన్నుకుంటారనే చర్చ జరుగుతోంది. నాలుగు సెక్టార్ల ఫలితాలు విడుదల తర్వాత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు.






