నిమ్స్ వైద్యుల కృషి అభినందనీయం.. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్

by Kema Shiva Kumar |

పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధపడుతోన్న చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం నిమ్స్ వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసించారు

నిమ్స్ వైద్యుల కృషి అభినందనీయం.. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్
X

దిశ, వెబ్‌డెస్క్: పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధపడుతోన్న చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం నిమ్స్ వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసించారు. ఇవాళ ఆయన నిమ్స్‌ ఆసుపత్రి మిలినియమ్ బ్లాక్‌లోని పీడియాట్రిక్ గుండె విభాగాన్ని పరిశీలించారు. ప్రముఖ బ్రిటన్ వైద్యులు దన్నపనేని రమణ, నిమ్స్ కార్దియో థోరాసిక్ విభాగాధిపతి అమరేశ్వర రావు సారథ్యంలో చిన్నారులకు చేస్తున్న గుండె ఆపరేషన్లను ఆయన కొనియాడారు. అనంతరం చిన్నారులకు అందుతున్న వైద్యం పట్ల అరా తీశారు. సొంత గడ్డకు సేవ చేస్తున్న రమణ‌ ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. పుట్టుక‌తో గుండె సమస్యలతో బాధపడుతోన్న శిశువులకు కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నారని.. అందులో బ్రిటన్ వైద్యులు పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ప్రముఖ బ్రిటన్ వైద్యులు దన్నపనేని రమణ మాట్లాడుతూ.. గత మూడేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం, నిమ్స్ గుండె విభాగాధిపతి అమరేశ్వర్ రావు సహకారంతో చిన్నారులకు గుండె ఆపరేషన్లకు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చిన్నారులు నిమ్స్‌కు వస్తున్నారని డైరక్టర్ నగరి భీరప్ప తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆరోగ్య శ్రీ, సీఎం సహాయనిధి ద్వారా పూర్తిగా ఉచితంగానే గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

Next Story