BRSను వెంటాడుతున్న డ్రగ్స్ భూతం..! కేటీఆరే టార్గెట్‌గా కాంగ్రెస్ విమర్శలు

by Kema Shiva Kumar |

తెలంగాణలో మరోసారి డ్రగ్స్ వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ ఉదంతం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

BRSను వెంటాడుతున్న డ్రగ్స్ భూతం..! కేటీఆరే టార్గెట్‌గా కాంగ్రెస్ విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌ను డ్రగ్స్​ వివాదం వెంటాడుతున్నది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు డ్రగ్​ పాజిటివ్​ నిర్ధారణ కావడం మరింత ఆజ్యం పోసినట్టయింది. ప్రభుత్వంపై విమర్శల దాడులు చేద్దామనుకునే సమయంలో ఇలాంటి వివాదాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయని నేతలు చర్చించుకుంటున్నారు. రేవంత్​రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​పై పదేపదే డ్రగ్స్​ ఆరోపణలు చేశారు. ఆయనకు వైట్​చాలెంజ్ సైతం విసిరారు. డ్రగ్ టెస్ట్ కోసం తన తల వెంట్రుకలు ఇస్తానని, నీవు ఇస్తావా? అంటూ గన్​పార్క్​వద్దకు వచ్చారు. కేటీఆర్​కోర్టుకు వెళ్లి మరీ తనపై ఆరోపణలు చేయొద్దని ఆదేశాలను తెచ్చుకున్నారు.

సీఎం రేవంత్ వ్యూహాత్మకం?

సీఎం అయ్యాక కూడా కేటీఆర్ ​డ్రగ్స్ ​అడిక్టర్​ అంటూ రేవంత్​రెడ్డి ఆరోపణలు కొనసాగించారు. కేటీఆర్​బామమరిది రాజ్​పాకాల ఇంట్లో పోలీసుల దాడులు జరిగినప్పుడు డ్రగ్స్ దొరికాయని కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్, కేటీఆర్​పై ఆరోపణలు గుప్పించారు. ఇలా పలుమార్లు డ్రగ్స్ వ్యవహారం​బీఆర్ఎస్​ను ఇరకాటంలోకి నెడుతున్నది. కేటీఆర్ పై రేవంత్​చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్​నేతలు పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సి వస్తున్నది. అయినా కూడా పార్టీ ఇమేజ్​కు నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పై యువత, మేధావులు, తల్లిదండ్రుల్లో చెడు అభిప్రాయం కలిగించేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే విమర్శల దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

టార్గెట్ కేటీఆర్..!

బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యే పైలెట్​రోహిత్​రెడ్డి డ్రగ్స్​వివాదంలో ఇరుక్కోవడం సంచలనంగా మారింది. గతంలో ఆయన కర్ణాటకలోనూ ఇదే తరహా ఘటనలో చిక్కుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ ను తీవ్ర విమర్శల పాలుచేసింది. తాజాగా ఆయన ఫాం హౌస్​లోనే డ్రగ్స్​పార్టీ జరగడంతో గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ వివాదంతో పార్టీకి సంబంధం లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నా.. అధికార పార్టీ నాయకులు నేత్రం కేటీఆర్​చుట్టే తిప్పుతున్నారు. దీనిపై కేటీఆర్​స్వయంగా వివరణ ఇచ్చినా కాంగ్రెస్​నేతలు మాత్రం ఆయన టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా వైట్​చాలెంజ్, డ్రగ్స్​టెస్ట్​సవాల్ తెరపైకి వచ్చింది. కాగా, డ్రగ్స్ కేసును బీఆర్ఎస్ పై రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని, తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని కేటీఆర్​ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్షలు చేయించుకోవాలన్న పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రతి డ్రగ్ కేసులోకి తన పేరును లాగాలని చూస్తే చట్టపరంగా నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. దీంతో అసెంబ్లీ సమావేశాల వరకు ఇదే వివాదం కొనసాగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వివాదాలకు కేరాఫ్ ఫాంహౌస్

మెయినాబాద్​లో ఉన్న పైలెట్ రోహిత్​రెడ్డి ఫాంహౌస్​వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గతంలో ఇదే ఫాంహౌస్​లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం సృష్టించింది.​తాజాగా మరోసారి డ్రగ్స్ వివాదంలో తెరపైకి వచ్చింది. దీంతో పైలెట్​రోహిత్​రెడ్డిపై పార్టీపరంగా చర్యలూ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఏపీలో టీడీపీ సిట్టింగ్​ఎంపీ వివరణ కోరిన నేపథ్యంలో ఇక్కడా రోహిత్​రెడ్డికి నోటీసు జారీచేసి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

Next Story