‌‌‘జిల్లా జనరల్ ఆసుపత్రిని వైద్య కళాశాలకు అప్పగించాలి’

by Disha Web Desk 4 |
‌‌‘జిల్లా జనరల్ ఆసుపత్రిని వైద్య కళాశాలకు అప్పగించాలి’
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంచి మెడికల్ కళాశాలకు నిర్వహణకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు మరికొన్ని పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించడమే కాకుండా సంబంధిత వైద్య అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థాయి పెంపు కోసం చేపట్టిన రెనోవేషన్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పూర్తి చేయాలన్నారు. అదనంగా చేయించిన పనుల బిల్లు చెల్లింపులపై తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు. రెండు లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడం, ఆపరేషన్ థియేటర్లలో టైల్స్, ఇతరత్రా పనులు పెండింగ్ లో ఉన్నాయని కాంట్రాక్టర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేసి ఆసుపత్రిని వైద్య కళాశాలకు అప్పగించే విధంగా చెక్ లిస్ట్ తయారు చేయాలన్నారు.

ఆసుపత్రి స్థాయి పెంపుతో పాటు వైద్య సిబ్బంది, మౌళిక సదుపాయాలు సమకూర్చినందున ఇకనుండి ప్రయివేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవలు చేయడం ద్వారా ఆసుపత్రికి ఆదాయం సమకూరుతుందన్నారు. అనంతరం ఆసుపత్రిలో రెనోవేషన్ పనులు, ఆపరేషన్ థియేటర్ గదులను పరిశీలించారు.

చిన్న చిన్న పనులు త్వరగా పూర్తి చేసి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రమాదేవి, టిఎస్ఐఈసి జనరల్ మేనేజర్ రవికుమార్, గైనకాలజిస్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డా. సుప్రియ, జనరల్ మెడిసిన్ డా. వాణి, డిసిహెచ్ఎస్ డా. రమేష్ చంద్ర, ఆర్‌యం‌ఓ దశరథ్, ఆర్‌యం‌ఓ డా.అజీమ్, కాంట్రాక్టర్ ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed