- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులపై ఓడిన సర్పంచ్ అభ్యర్థి కుటుంబం రాళ్ల దాడి.. గ్రామంలో హై టెన్షన్
ఆదిలాబాద్ జిల్లాలో గెలిచిన వారికి, ఓడిన వారికి మధ్య జరిగిన వివాదం రచ్చరచ్చగా మారింది. చివరకు పోలీసులపై రాళ్ల దాడి వరకు వెళ్లింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు ముగిశాయి. గెలిచిన అభ్యర్థులంతా సంబరాల్లో మునిగిపోగా ఓడిన వారంతా నిరాశలో ఉన్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల మూడ్ ఇంకా చల్లారలేదు. పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad District) గెలిచిన వారికి, ఓడిన వారికి మధ్య జరిగిన వివాదం రచ్చరచ్చగా మారింది. చివరకు పోలీసులపై రాళ్ల దాడి వరకు వెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నేరడిగొండ మండలం చిన్నబుగ్గారం (Chinnabuggaram Village) గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections) ఓ మహిళా అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో తనకు ఓటు వేయలేదనే కోపంతో తమ ఇంటి వద్ద గ్రామంలోకి వెళ్లే రోడ్డుపై ఎడ్ల బండిని అడ్డుగా పెట్టారు. అభ్యర్థి కుటుంబ సభ్యుల తీరుపై అవాక్కయిన గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుకు అడ్డుగా పెట్టిన ఎడ్లబండిని తొలగిస్తున్న క్రమంలో ఓడిన అభ్యర్థి కుటుంబసభ్యులు పోలీసులపై దాడికి దిగారు. రాళ్లతో దాడికి పాల్పడడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎస్సై ఇమ్రాన్‌ఖాన్, కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.






