- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నామినేషన్లకు నేటితో ముగిసిన గడువు.. చివరి సెట్ దాఖలు చేసిన దీపక్‌రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. చివరి రోజు కావడంతో వివిధ పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ బీజేపీ అభ్యర్థిగా అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి ఫైనల్ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రిటర్నింగ్ అధికారి సాయిరాంకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. అందజేశారు. దీపక్‌రెడ్డి నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు పాల్గొన్నారు. కాగా, అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అధినాయకత్వం నిర్ణయం మేరకు లంకల దీపక్‌రెడ్డికి బీఫామ్ లభించింది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలలోపు వచ్చిన వారికి నామినేషన్ల దాఖలుకు అనుమతించారు. ఇక వచ్చిన నామినేషన్లను రేపు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 24 వరకు గడువు ఇచ్చారు. నవంబర్ 11న ఈసీ పోలింగ్ ప్రక్రియ నిర్వహించి.. నవంబర్ 14న కౌంటింగ్ చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.






