మద్యం టెండర్లకు రేపటితో ముగియనున్న గడువు.. BC JAC బంద్‌తో ఆందోళనలో అశావహులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-17 08:49:17  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మ‌ద్యం షాపుల కోసం ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించిన విషయం తెలిసిందే.

మద్యం టెండర్లకు రేపటితో ముగియనున్న గడువు.. BC JAC బంద్‌తో ఆందోళనలో అశావహులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మ‌ద్యం షాపుల కోసం ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు శ‌నివార‌మే చివ‌రి రోజు కావడంతో అశావహులు నిర్ణీత సమయంలోపు దరఖాస్తులను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. నిన్నటి వరకు స్టేట్‌ వైడ్‌గా 25 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని వారు తెలిపారు. బుధవారం వరకు 9,600 దరఖాస్తులు రాగా గురువారం ఒక్క రోజే 10 వేల దరఖాస్తులు స్వీకరించామని వెల్లడించారు.

అయితే, దరఖాస్తు రుసుము రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడం వల్లే మద్యం షాపుల టెండర్లకు స్పందన లేకుండా పోయిందని మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఓ వైపు దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగుస్తుండటం.. మరోవైపు బీసీ జేఏసీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆశావహుల్లో గందరగోళం నెలకొంది. దరఖాస్తులు దాఖలు చేయాలంటే బ్యాంకులలో డిమాండ్ డ్రాఫ్ట్స్ (DD) తీయడం తప్పనిసరి. దీంతో అదివారం వరకు దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే, పెద్ద ఎత్తున వస్తున్న ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Next Story