- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాఫిక్ బూత్ బాక్స్ లో డెడ్ బాడీ కలకలం
by Prasad Jukanti |
హైదరాబాద్ నగరం నడిబొడ్డున డెడ్ బాడీ కలకలం రేపింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో:హైదరాబాద్ నగరం నడిబొడ్డున డెడ్ బాడీ కలకలం రేపింది.బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ కృష్ణ ముందున్న ట్రాఫిక్ బూత్ బాక్స్ లో రక్తం మడుగులో మృతదేహం కనిపించడం సంచలనంగా మారింది. దీంతో విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రక్తం మడుగులో మృతదేహాం పడి ఉండటం అది కూడా ట్రాఫిక్ ను కంట్రోల్ చేసే బూత్ బాక్స్ లో శవం లభించడం కలకలంగా మారింది. మృతుడు ఎవరు? ఇది హత్యా లేక ఆత్మహత్యా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. హత్య జరిగితే ఇక్కడే చంపేశారా లేక మరెక్కడైనా చంపి ఇక్కడ పారేశి వెళ్లిపోయారా అనేది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది.
Next Story






