రైతులను రోడ్డెక్కిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..

by Elthuri vijay kumar |

రైతుల సాగులో కష్టాలు తెప్పించి రోడ్డు ఎక్కించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.

రైతులను రోడ్డెక్కిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..
X

రైతులను రోడ్డెక్కిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..

రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు ఆగమాగం

కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షం

మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

దిశ, మక్తల్ : రైతుల సాగులో కష్టాలు తెప్పించి రోడ్డు ఎక్కించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం 12 గంటలకు మక్తల్ నియోజకవర్గంలోని మాగనూర్ .కృష్ణ మండలాల పార్టీ నాయకులతో టైం రోడ్డు కూడలిలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెంరామ్మో హన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బి.ఆర్.ఎస్ పార్టీ ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటివరకు పూర్తిగా రెండు లక్షల రుణమాఫీ జరగలేదని, రైతు భరోసా అంతంతే అందిందని, రైతు చనిపోతే వచ్చే ఐదు లక్షలు ఇవ్వడం లేదని ఆరోపించారు. గత రెండేళ్లుగా రైతులు పండించిన పంటకు సరైన మార్కెట్ ధర లేక అవస్థలు పడ్డారని వాపోయారు. రైతులు ప్రభుత్వంపై కక్ష తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో స్వేచ్ఛగా తిరిగేది కష్టంగా మారుతుందని ఆయన అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ఛోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకొని ఆల్మట్టిపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో రైతులకు సాగునీటి కష్టాలు తప్పవని హెచ్చరించారు. సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులను మద్దతు ధరకు అందిస్తూ, రైతన్నలకు సమయానికి యూరియా అందించిన ఘనత కేసీఆర్ కే దర్కుతుందని, రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన కావాలని ప్రజలు, రైతులు కోరుతున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజుల ఆశిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెంకట్ రెడ్డి, మాగనూర్ మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి, కృష్ణ మండలం నాయకులు శివ పాటిల్, పెద్ద అశోక్ గౌడ్, మాజీ సర్పంచ్ శివప్ప, మాజీ సర్పంచ్ రామకృష్ణ, మాజీ సర్పంచ్ అమ్రేష్, శంకరప్ప, సురేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Next Story