- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉంది : ఎంపీ మల్లు రవి
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావలసిన అవసరం ఉందని ఎంపీ మల్లు రవి అభిప్రాయపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రెండుసార్లు రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నా కూడా ఆసక్తి చూపలేదని, ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యలు తెలుసుకొని తర్వాతనే పాలకుడిగా రావాలని ఆయన అనుకున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి చెప్పారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అనేక సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని దగ్గర ఉండి చూస్తున్నాం. ఇప్పుడు ఆయన మొదటిసారి ప్రధానమంత్రి అయ్యేందుకు అంగీకారం తెలిపారని మల్లు రవి అన్నారు. మంగళవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి రాహుల్ ప్రధాన మంత్రి కావాల్సిన అవసరం ఉందని, ఆయన దేశంలోని సామాజిక సమస్యలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారని, భారత్ జోడో, న్యాయ యాత్రలతో దేశం అంత పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని మల్లు రవి చెప్పారు. లీడర్ ఆఫ్ అపొజిషన్ రాహుల్ దేశ సమస్యలపై అద్భుతమైన పోరాటం చేస్తున్నారని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయడానికి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనను రాహుల్ అంగీకరించడం హర్షణీయమని మల్లు రవి చెప్పారు.






